లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల సత్వర పరిష్కారం
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:45 PM
లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకొని రాజీద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎస్ శివకుమార్ తెలిపారు.
కరీంనగర్ లీగల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకొని రాజీద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎస్ శివకుమార్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజీ ద్వారా ఇరు పార్టీల వారు తమ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకుని సమయం, డబ్బు వృథా కాకుండా చూసుకోవాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ న్యాయమూర్తులు, పోలీసు అధికారుల సహకారంతో లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. సీసీఆర్‌బీ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు కృషి చేసినట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వెంకటేష్ లోక్ అదాలత్‌ల గురించి వివరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లతో 3,194 పరిష్కరించినట్లు తెలిపారు.
ఫ రాజీ మార్గమే రాజ మార్గం...
హుజూరాబాద్: రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి పీబీ కిరణ్‌కుమార్ అన్నారు. శనివారం హుజూరాబాద్ కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 924 కేసులు పరిష్కరమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో మనం పద్ధతలు మర్చిపోతామని, తొందరపాటు వల్ల నేరం జరిగిగే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మసాయిశ్రీ, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీణా ప్రణతి, స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఈశ్వరయ్య, హుజూరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యతిపతి అరుణ్‌కుమార్, ఏసీపీ మాధవి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్ ఉపేందర్, ఏజీపీ శ్రీనివాస్, వెంకటేశ్వర్, టౌన్ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.