సబ్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:53 AM
సబ్ హెల్త్ సెం టర్ నిర్మాణాలల్లో వేగంపెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : సబ్ హెల్త్ సెం టర్ నిర్మాణాలల్లో వేగంపెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు. కలెక్టరేట్‌లో జిల్లాలో మంజూరైన 16 ప్రాథమిక ఆరోగ్య సబ్‌హెల్త్ సెంటర్‌ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో మంజూరైన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చామన్నారు. మరో ప్రాథమిక అరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. గంభీరావుపే టలో రూఫ్ దశలో ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాకు మంజూరైన 16 సబ్ హెల్త్ సెంటర్‌లు మంజూరు కాగా, ఐదు సబ్ హెల్త్ సెంటర్‌ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం జరిగిందన్నారు. సంబంధిత మండల తహసీ ల్దార్‌కు కలెక్టర్ స్వయంగా ఫంక్షన్‌లో మాట్లాడి భూసమస్య లను పరిష్కారించడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ హెల్త్ సెంటర్‌ల నిర్మాణాల పనులు అదేవిధంగా గంభీరావుపేట మండల ప్రాథమిక అరోగ్య కేంద్ర భవన నిర్మా ణాల్లో వేగం పెంచి సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబా టులోకి తీసుకరావాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారు లను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్ హెల్త్ సెంటర్‌ల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు అందుబాటులో పెట్టిందని పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక చొరవతో పూర్తి చేయించాలన్నారు. అగ్రహారం, తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో కొత్త సబ్‌హెల్త్ సెంటర్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలను అందించా లని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గీత, ఆర్‌అండ్ బీ అధికా రులు తదితరులు పాల్గొన్నారు.