దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:46 PM
ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రా లతో పాటు గ్రామాల్లోని దుర్గామాత మండపాల్లో మంగళ వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులు సమర్పించారు. ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారు దుర్గామాత అవతారంలో దర్శనమిచ్చారు. ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్లు కృష్ణహ రి, మల్లేశం, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోనరావుపేట : శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భా గంగా మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొలనూ రులో దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఫిరోజ్ పాషా ఉన్నారు.
చందుర్తి : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో శర న్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీదుర్గా దేవి అవతారంలో దర్శనమిచ్చారు. మల్యాలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందుర్తిలో చండీ యాగం నిర్వహించారు.చందుర్తిలో, కట్టా లింగంపేట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రుద్రంగి :శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని మహాలక్ష్మి వీధిలో దుర్గమాత, బతుకమ్మ కాలనిలో ఏర్పాటు చేసిన దుర్గదేవిల వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూ జలు నిర్వహించారు. మహా అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభ లత మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, కోమిరె శంకర్, గండి నారాయణ, పల్లి గంగాధర్, ఇప్ప మహేష్, మాడిశెట్టి అభిలాష్, పిడుగు లచ్చిరెడ్డి, ఎర్రం రాజలింగం, గంధం మనోజ్, దవ్యాల దీలీఫ్, గుగ్గిళ్ల వెంకటేశం, దయ్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలలో అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో మంగళవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. మండలకేంద్రంలో హిందువాహిణీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఆయా గ్రామాల భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు నాగసముద్రాల బాలకృష్ణ, మాజీ ఏఎమ్‌సీ చైర్మన్ మామిడి సంజీవ్, కొండ్ల వెంకట్‌రెడ్డి, మామిడి రాజు, సాదుల రాకేష్, రామకృష్ణ, హరికుమార్, ఎర్రోజు సంతోష్‌కుమార్, శ్రీనివాస్, మ్యాకల మల్లేశంలతో పాటు భవాని భక్తులు, యువకులు పాల్గొన్నారు.