Share News

మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:07 AM

మండలంలోని ఉల్లంపల్లి శివారులో ఉన్న ఓదెల మల్లికార్జునస్వామికి శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం గ్రామ కుర్మగొల్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు.

మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు

చిగురుమామిడి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉల్లంపల్లి శివారులో ఉన్న ఓదెల మల్లికార్జునస్వామికి శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం గ్రామ కుర్మగొల్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. గుట్టపైకి డోలు చప్పుళ్లతో బోనాలు తీసుకుని వెళ్లారు. గుట్ట పైన వెలిసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. గుట్ట కింద ఉన్న ఆలయంలో పట్నం వేశారు. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన యాదవులు స్వామి వారికి పెద్ద పట్నం వేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కోల రవీందర్‌, సభ్యులు మేడుదుల కొమురయ్య, కత్తుల శివ, కత్తుల దేవేందర్‌, మ్యాదరవేణి ప్రవీణ్‌, కశరవేణి ఓదేలు, బుల్లి రంజిత్‌, ఆత్మకురి కనుకయ్య, రాజయ్య, బుల్లి సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:07 AM