Share News

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:38 PM

ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసు కుంటుందని, జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు కోరారు.

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక చర్యలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసు కుంటుందని, జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు కోరారు. సిరిసిల్ల సమీకృ త జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రులు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, జిల్లా అధికారులుతో జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సమీక్షించి ఇప్పటివరకు కొనుగోలు చేసి ధాన్యం, పత్తిల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ప్రారంభించని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టా లని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం రైతు లకు హామీ ఇచ్చిందని దీనికి అనుగుణంగా వివరా లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల న్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా వేస్తూ అవసరమైన మేర వాహనాలు, ఇతర ఏర్పాట్లు సిద్దం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్టు చేసి కొనుగోలు కేంద్రాలల్లో టార్పిన్‌కవర్లు, గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్‌లను సిద్దం చేసుకోవాలనిసూచించారు. రైతులు పత్తి, ధాన్యం పంటల అరబెట్టుకుని నిర్ణీత తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.

ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు..

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటి కప్పుడు నమోదు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యోలా చూడా లని కోరారు. పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని ఆమె సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాష్‌, జిల్లా సహాకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, డీటీవో లక్ష్మణ్‌, మెప్మ ఏవో మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:38 PM