Share News

ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:09 AM

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

సిరిసిల్ల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణ తరలింపుపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి సమీక్షించారు. జిల్లాలో ధాన్యం ఉత్పత్తి, కొనుగో లుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు 50 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించామని అధికారులు తెలిపారు. ఈ సం దర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు ధాన్యం విక్రయించడంలో ఇబ్బందులు పడవద్దని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఒప్పందం ప్రకారం లారీల కాంట్రాక్టర్‌ ఐదు రూట్లలో 500 లారీలు సమకూర్చాల్సి ఉండగా 150 లారీల వరకే సమకూర్చడంతో ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ధాన్యం తరలింపుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని వంద లారీలను, రైస్‌మిల్లర్ల పరిధిలో 50లారీలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. రుద్రంగి, చందు ర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట తదితర మండలాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటనే తరలించాలన్నారు. వేములవాడ నియో జకవర్గంలో 74 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి వరకు ధాన్యం సేకరించాలని అన్నారు. అయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రైస్‌మిల్లర్లకు ధాన్యం తరలింపు విషయం అధికారుఅలు చూసుకుంటారని రైతులు ఆందోళనలు చెందవద్దని భరోసాను ఇచ్చారు. రుద్రంగిలో రైస్‌మిల్లుల కు ధాన్యం తరలిస్తూనే ఏఎంసీ గోడౌన్‌లలో కూడా నిల్వ చేయాలన్నా రు. జిల్లాలో రైస్‌మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చేందుకు ముందుకు రాక పోతే అపెరల్‌ పార్కులోని గోదాములు, ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, డీసీఎస్‌వో వసంత లక్ష్మీ, డీఎం రజిత, జిల్లా వ్యవసాయ అఽధికారి అప్జల్‌భేగం, డీటీవో లక్ష్మణ్‌, డీసీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:09 AM