Share News

డంపింగ్‌ యార్డు ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - May 07 , 2025 | 11:22 PM

డంపింగ్‌ యార్డు ప్రక్షాళన చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. బుధవారం నగరంలోని బైపాస్‌ రోడ్డులోగల నగరపాలక సంస్థ డంపింగ్‌ యార్డును అధికారులతో కలిసి సందర్శించారు.

డంపింగ్‌ యార్డు ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు

కరీంనగర్‌ టౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): డంపింగ్‌ యార్డు ప్రక్షాళన చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. బుధవారం నగరంలోని బైపాస్‌ రోడ్డులోగల నగరపాలక సంస్థ డంపింగ్‌ యార్డును అధికారులతో కలిసి సందర్శించారు. గతంలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్‌ ప్రక్రియతోపాటు డీఆర్‌సీసీ సెంటర్‌ను తనిఖీ చేశారు. డంపు యార్డుకు వస్తున్న చెత్తను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణు మాధవ్‌, ఈఈ సంజీవ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:22 PM