Share News

గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:45 AM

గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు.

గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
పోలీస్‌ స్టేషన్లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

ఎస్పీ అశోక్‌ కుమార్‌

ఇబ్రహీంపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నివారణ లక్ష్యంగా పనిచేయాలని, విజిబుల్‌ పోలింగ్‌ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని సూచించారు. త్వరలో స్థానికసంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ నేరాల నివారణపై యువతను చైతన్య పరచాలని సూచించారు. తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్‌ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దరఖాస్తులో ఉన్న కేసులను పరిశీలించి తనిఖీ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ రాములు, మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్‌, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్‌, ఎస్సైలు శ్రీకాంత్‌, రాజు, నవీన్‌, రాజు నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:45 AM