Share News

ప్రైవేటు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:00 AM

ప్రత్యేకం లోక్‌అదాలత్‌లో ప్రైవేటు ఫిర్యాదు కేసులు, పాత కేసుల పరి ష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూ ర్తి బి. పుష్పలత కోరారు.

ప్రైవేటు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

సిరిసిల్ల రూరల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక లోక్‌అదాలత్‌లో ప్రైవేటు ఫిర్యాదు కేసులు, పాత కేసుల పరి ష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూ ర్తి బి. పుష్పలత కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాం గణంలో మంగళవారం బార్‌అసోషియేషన్‌ న్యాయవాదులతో స్పెషల్‌ లోక్‌ అదాలత్‌పై సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన కోర్టులలో నిర్వహించే ప్రత్యే క లోక్‌అదాలత్‌లో ప్రజల మేలు కోసం పాత కేసులు పరిష్కా రంపై ప్రత్యేకదృష్టి సారించాలని పెండింగ్‌లో ఉన్న చిన్న క్రిమి నల్‌ కేసులు, ఇతర కంపౌండబుల్‌ కేసులను ఆధునిక పద్ధతుల్లో సమ ర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్‌అదాలత్‌ ఉపయోగపడు తుందన్నారు. కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు త్వరగా న్యాయం అందేలాచర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్‌, సిరిసిల్ల బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షులు జూపెల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:00 AM