అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:32 AM
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్ ఆదేశించారు.
వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్ ఆదేశించారు. వీర్నపల్లి మండల పరిష త్తు కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మండలంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల వ్యయాలను అభ్యర్థుల నుంచి రోజు వారిగా స్వీకరించాలని అన్నారు. పలు సూచనలు చేశారు. ఆయన వెంట నోడల్ అధికారులు నవీన్, భారతి, ఎంపీడీవో శ్రీలేఖ, తదితరులు ఉన్నారు.