పోషణలోపం చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:10 PM
బాల్యంలో పౌష్టికాహారం అందితేనే పిల్లలు భవిష్యత్తులోత్‌లో బలంగా మారుతారు. వయస్సును బట్టి తగిన ఎత్తు, బరువు ఉన్నప్పుడే ఆరోగ్యం కరంగా ఉంటారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 18 (ఆంధ్రజ్యోతి): బాల్యంలో పౌష్టికాహారం అందితేనే పిల్లలు భవిష్యత్తులోత్‌లో బలంగా మారుతారు. వయస్సును బట్టి తగిన ఎత్తు, బరువు ఉన్నప్పుడే ఆరోగ్యం కరంగా ఉంటారు. తల్లిలదండ్రుల అవగాహన లోపం, జన్యు పరమైన సమస్యలు, ఆనారోగ్య కారణాలతో చిన్నారులు బాధపడుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నాయి. ప్రధానంగా పోషకాహారలోపం సమస్య అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతినెలా కేంద్రాల్లోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 172 అంగన్ వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడెళ్ల లోపు చిన్నారులకు ప్రతీ నెలా బాలామృతం ప్యాకెట్లు అందించడంతోపాటు పోషణలోపంతో బాధపడే చిన్నారుల కోసం సామ్, మామ్ విభాగాలుగా గుర్తించి బాలమృతం ప్లస్ పంపిణీ చేస్తున్నారు. ఎత్తుకు తగిన బరువులేని విభాగంలో తీవ్ర పోషణ లోపం(మామ్), అతి తీవ్ర పోషణలోపం(సామ్) పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి మొత్తం 465మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతీ నెల చిన్నారుల బరువు, ఎత్తు కొలిచి వివరాలను సంబంధిత యాప్ (ఎన్‌హెచ్‌టీఎస్)లో నమోదు చేస్తున్నారు. తల్లిదండ్రులు, వైద్యాధికారులతో కలిసి సమన్వయం చేసకుఉంటూ పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.