Share News

విద్యతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:50 AM

ఉత్తమ బోధన అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంద ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పేర్కొన్నారు.

విద్యతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ఉత్తమ బోధన అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంద ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పేర్కొన్నారు. మం గళవారం సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శిం చి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 338కంటి అద్దాల ను పంపిణీ చేశామని, అవసరమైన వారికి శస్త్రచికి త్సల కోసం హైదరాబాద్‌లోని సరోజిని కంటి ఆసుప త్రికి పంపుతామని కలెక్టర్‌కు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రజిత వివరించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కలెక్టర్‌ కంటి అద్దాలను అందజేశారు. తదనంతరం విద్యాల యంలోని తరగతి గదులను, కిచెన్‌, స్టోర్‌ రూమ్‌ ను కలెక్టర్‌ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మ్యూనైజేషన్‌ అధికారి డా.సంపత్‌, ఆర్‌.బి.ఎస్‌.కె. ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నయీం జహా, మెడికల్‌ ఆఫీ సర్‌ కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

వేములవాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తు న్నదని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆర్‌బీఎస్‌కే వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధి కారి రజిత, పాఠశాల ప్రిన్సిపాల్‌ స్వప్న, మండల విద్యాధికారి బన్నాజీ, జీఈసీవో పద్మజ, వైద్యాధికారు లు నహిమ జహ, సంపత్‌, ఏఎన్‌ఎం శైలజ, సౌజ న్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:51 AM