Share News

యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:45 AM

పంటల సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అదేశించారు.

యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : పంటల సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన వీడియోకాన్సరేన్స్‌లో హైదరాబాద్‌ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ అధికారులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు యూరియా సరఫరాలపై ఎస్పీ మహేష్‌ బీ గితేతోపాటు జిల్లా అధికా రులతో సమీక్షించి యూరియా సరఫరా, పంపిణీలపై అడిగి తెలుసుకు న్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మే చివరి వారం లో వర్షాలు ప్రారంభం కావడంతో జూలై, ఆగస్టు నెలలో మంచి వర్షాలు కురువడం వల్ల రైతులు వరి, పత్తి,మిర్చి, పప్పుదినుసు ల వంటి అనేక రకాల పంటలను ఒకేసారీ సాగు చేయడం వల్ల తెలంగాణకు కేటాయించిన యూరియా స్టాక్‌ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వంటి వివిధ కారణాల వల్ల కొంత యూరియా సమస్య ఉందన్నారు. చైనా, జర్మనీ, ఇరాన్‌, యా మాన్‌ వంటి పలు దేశాల నుంచి రావాల్సిన యూరియా సర ఫరా కావడం లేదన్నారు. ఏప్రిల్‌ నెల నుంచి కేటాయింపుల మేరకు మనకు యూరియా సరఫరా కాలేదని మొత్తం మూడు లక్షల మేట్రిక్‌ టన్నుల తక్కువ సరఫరా అయ్యిందన్నారు. రాబో యే 45రోజుల పాటు యూరియా సరఫరాలపై జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ, జిల్లా అఽధికారులు దృష్టి సారించాలన్నారు. మండల స్థాయిలో స్టాక్‌ వివరాలు మానిటరింగ్‌ చేయాలని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియాను తరలించి రైతులకు అందిం చాలన్నారు. ప్రస్తుతం ప్రైవేట డీలర్ల వద్ద 35 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా స్టాక్‌ అందుబాటులో ఉందని అది సక్రమంగా విక్రయిం జరేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ పూర్తి స్థాయిలో సద్విని యోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:45 AM