Share News

ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:12 AM

వలస కార్మికుల పిల్లలకు ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి చదువు చెప్పాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం గట్టుబూత్కుర్‌ పాఠశాలలో ఇటుక బట్టీ కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను ఆమె బుధవారం పరిశీలించారు.

ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

గంగాధర, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వలస కార్మికుల పిల్లలకు ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి చదువు చెప్పాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం గట్టుబూత్కుర్‌ పాఠశాలలో ఇటుక బట్టీ కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ పిల్లలకు ఏం కావాలో వారి మాతృభాషలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ట్రాక్‌ సూట్‌, బ్యాగులు, షూస్‌ అందించాలని అక్కడే ఉన్న జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావుకు సూచించారు. ఇంగ్లీష్‌, గణితం లాంటి ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని పల్లె దవాఖాన వైద్యులకు సూచించారు. అనంతరం ఆరో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పాఠశాలలోని కిచెన్‌ గార్డెన్‌ సందర్శించి పలు సూచనలందించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్‌రావు, హెచ్‌ఎం అశోక్‌రెడ్డి, ఎంపీడీవో రాము, పీఎస్‌ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:12 AM