కుక్క, కోతి కాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:58 PM
కుక్క, కోతి కాటుకు గురైన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య సిబ్బందికి సూచించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్క, కోతి కాటుకు గురైన వారిని కోర్సు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.
సుభాష్‌నగర్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కుక్క, కోతి కాటుకు గురైన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య సిబ్బందికి సూచించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్క, కోతి కాటుకు గురైన వారిని కోర్సు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విటమిన్ గార్డెన్స్‌పై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ప్రతి పాఠశాలలో స్నేహిత బోర్డులు, విద్యార్థుల కెరియర్ చార్ట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రొగ్రాం ఆఫీసర్ సనా, విద్యాశాఖ కో-ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.