Share News

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:59 AM

ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో డిసెంబరు 30 మంగళవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నా యి.

ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం

- ధర్మపురిలో 30న వేడుకలు

ధర్మపురి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో డిసెంబరు 30 మంగళవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నా యి. ఉత్సవాల కోసం స్వామివారి ఆలయం ముస్తాబు అ య్యింది. ఆలయ ఆవరణలో ఉత్తర ద్వారం నుంచి ఎదురు గా ముక్కోటి వేదిక వరకు టెంట్లు వేసి, పూల కుండీలు అమర్చి అందంగా అలంకరణ చేయాలని నిర్ణయించారు. ఆలయ గోపురాలు, ఆలయాలకు రంగు రంగుల విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. ఇసుక స్తంభం నుంచి దేవాల యం వెనుక దారి మీదుగా ఉత్తర ద్వారం వరకు భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఫ సచ్చితానంద సరస్వతి స్వామివారితో..

ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా డిసెంబరు 30న ఉదయం లక్ష్మీసమేత యోగ, ఉగ్రనారసింహ, వేంకటేశ్వర స్వాముల మాల విరాట్‌ల కు మహా క్షీరాభిషేకాలు, నివేదన, మంత్ర పుష్పములు జరుగుతాయని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌ తెలిపారు. ఉదయం ఐదు గంటలకు ధర్మపురి శ్రీమఠం పీఠాధి పతి సచ్చితానంద సరస్వతి స్వామివారితో వైకుంఠ ద్వార దర్శన పూజ జరుగుతుందని వారు వివరించారు. అనంతరం వైకుంఠ ద్వారం తెరచి భక్తులకు స్వామి దర్శనం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని వారు పేర్కొన్నారు. ధర్మపురి క్షేత్రంలోని శేషప్ప కళావేదికపై భక్తి సంగీత విభావ రి కార్యక్రమాలు ఉంటాయి.

Updated Date - Dec 28 , 2025 | 01:00 AM