Share News

త్వరలో మున్నూరుకాపుల సింహ గర్జన

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:55 AM

త్వరలో మున్నూరు కాపుల సింహగర్జన నిర్వహిస్తామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య వెల్లడించారు.

త్వరలో మున్నూరుకాపుల సింహ గర్జన

గంభీరావుపేట, అక్టోబరు 22 (ఆంద్రజ్యోతి) : త్వరలో మున్నూరు కాపుల సింహగర్జన నిర్వహిస్తామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య వెల్లడించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం మండల స్థాయి మున్నూరు కాపుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొండ దేవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మున్నూరు కాపు జనాభా లెక్క తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు అందించి కుల గణన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువగా ఉందని, అందుకే సభ్యత్వ నమోదు ద్వారా ప్రభుత్వాలకు వివరిస్తామన్నారు. మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రాల్లో సంఘ భవనాలను నిర్మించాలన్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మున్నూరు కాపుల సింహగర్జన సభను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మేకర్తి భిక్షపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్లూరి చందన, నాయకులు ఎర్ర నర్సయ్య, గంట అశోక్‌, కిరణ్‌బాబు, బోయన్నగారి లింగం, వేశాల వెంకటి, హన్మండ్లు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:55 AM