Share News

భూ భారతి ద్వారా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - May 12 , 2025 | 11:25 PM

భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కస్కారమవుతాయని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మి కిరణ్‌ అన్నారు. భూ భారతి చట్టం పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్‌ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను సోమవారం నిర్వహించారు.

 భూ భారతి  ద్వారా సమస్యల పరిష్కారం
దుద్దెనపల్లి గ్రామంలోని రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మ కిరణ్‌

- అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మి కిరణ్‌

సైదాపూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కస్కారమవుతాయని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మి కిరణ్‌ అన్నారు. భూ భారతి చట్టం పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్‌ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ దుద్దెనపల్లి, బొమ్మకల్‌ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వివిద భూ సమస్యలపై దుద్దెనపల్లిలో 61, బొమ్మకల్‌లో 32 దరఖాస్తులు వచ్చాయని, రెండు గ్రామాల్లో కలిపి 93 ధరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్‌ గుర్రం శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - May 12 , 2025 | 11:25 PM