Share News

‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:28 AM

పెండింగ్‌ సాదాబై నామా దరఖాస్తులు నూతన ఆర్వోఆర్‌ చట్టం భూ భారతిలో పరి ష్కారం అవుతాయని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు.

‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం

గంభీరావుపేట, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌ సాదాబై నామా దరఖాస్తులు నూతన ఆర్వోఆర్‌ చట్టం భూ భారతిలో పరి ష్కారం అవుతాయని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గరువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్‌ ఈసందర్భంగా రైతులకు వివరించారు. రెవెన్యు వ్యవస్థను బలోపే తం చేసేందుకు గ్రామాల్లో పరిపాలన అధికారులను నియమించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్‌ కార్డులాగా భూమికి భూదార్‌ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుం దని, దీని ద్వార భూ అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యు డివిజ న్‌ అధికారి నిర్ణయంపై కలెక్టర్‌ వద్ద, కలెక్టర్‌ నిర్ణయంపై భూమి ట్రైబ్యునల్‌ వద్ద అప్పీల్‌ చేసుకొవచ్చని గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైన అభ్యంతరాలు ఉంటే సివిల్‌ కోర్టుకు మాత్రమే వెళ్ళాల్సి ఉండేదన్నారు. రెవెన్యు రికార్డులను తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామంలో డిస్‌ప్లే చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్‌ మారుతిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 01:28 AM