Share News

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:23 AM

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల కలెక్టరే ట్‌లో కలెక్టర్‌ ఎం.హరితతో మాట్లాడారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారి పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయడానికి వీలులేదని స్పష్టంచేశారు. విద్యా ర్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దీనిపై కలె క్టర్‌ వెంటనే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ యాజమానులతో సమావేశాన్ని నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌కు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభు త్వం దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. సామాజిక బాధ్యతగా భావించి విద్యారంగంపై ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పి స్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమపద్ధతిలో విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో జరుగుతున్న పాఠ్యాంశాల భోధన, వసతులను క్షేత్రస్థాయి లో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూల్స్‌తో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ కింద ఎంఓయూ చేసుకునే సమయంలోనే ఫీజులకు సంబం ధించిన అంశాలు ఉంటాయనే విషయాన్ని యజమానులకు తెల పాలని సూచించారు.

ఇబ్బందులు కలగకుండా చర్యలు : కలెక్టర్‌

జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఏడు ఉండగా 338 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాగే ఎస్టీ విద్యార్థులకు ఒక స్కూల్‌ ఉండగా 35 మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్‌ తెలిపారు. విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాధికారి వినోద్‌కుమార్‌, డీఎస్‌సీ డీవో రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:23 AM