వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:51 PM
విద్యుత్ వినియోగదారుల సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్‌వీ వేణుగోపాలచారి అన్నారు.
గణేశ్‌నగర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్‌వీ వేణుగోపాలచారి అన్నారు. మంగళవారం నగరంలోని ఒకటో సెక్షన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలువురు క్షేత్ర స్థాయి అధికారులు సీటీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించడం లేదన్నాన్నారు. సకాలంలో స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల ఫోరం సభ్యులు కె రమేశ్, ఎన్ దేవేందర్, టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, ఏసీవో రాజేంద్రప్రసాద్, డీఈ రాజం పాల్గొన్నారు.