ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:15 AM
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించా లనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యు త్ ప్యానెల్స్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్కమార్క కలెక్టర్‌ను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించా లనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యు త్ ప్యానెల్స్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్కమార్క కలెక్టర్‌ను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో శనివారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోలార్ విద్యుత్‌ప్యానెల్స్ ఏర్పాటుపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టివిక్రమర్క మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం, ఉత్పత్తిని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలపై పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయంతోపాటు అన్ని ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు వారం రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని ఆదేశిం చారు. సోలార్ విద్యుత్ వినియోగంతో కరెంట్ బిల్లుల భారం తగ్గుతుంద న్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విద్యాసంస్థ ల వివరాలు అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను వారం రోజులల్లో పంపించాలన్నారు. ఆర్వోఓఎప్ అర్ చట్టం ప్రకారం గిరిజనులకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్‌లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిందని వివరించారు. ఆర్వోఓఎఫ్ అర్ భూములలో సోలార్ పంపుసెట్ల్ ఏర్పాటు ప్రక్రియ మూడు సంవత్సరాలల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న సోలార్ విద్యుత్ ప్యానెల్స్‌ల ఏర్పాటుపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.