Share News

దొంగతనాల కేసుల్లో ఆరుగురి అరెస్టు

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:57 PM

కరీంనగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంత పరిధిలో కొన్ని నెలలుగా రైతులు, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించిన, దొంగతనాల కేసులకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం వివరాలు వెల్లడించారు.

దొంగతనాల కేసుల్లో ఆరుగురి అరెస్టు

కరీంనగర్‌ క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంత పరిధిలో కొన్ని నెలలుగా రైతులు, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించిన, దొంగతనాల కేసులకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం వివరాలు వెల్లడించారు. చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌ చౌరస్తా వద్ద శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా దొంగతనాలకు సంబం ధించి నిందితులను పట్టుకున్నారు. చొప్పదండి, చిగురుమాడి, మానకొండూర్‌, గంగాధర, కరీంనగర్‌ రూరల్‌, రామడుగు, ఎల్‌ఎండీ, దుగ్గొండి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 15 దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. కట్టరాంపూర్‌కు చెందిన మనుపాటి శేఖర్‌, చొప్పదండికి చెందిన మనుపాటి సంజీవ్‌, బేగంపేటలోని రామగిరికి చెందిన ఉండాటి మహేశ్‌, ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌కు చెందిన బోదాసు కుమార్‌, కమాన్‌పూర్‌ మండలం పెంచికల్‌పేట్‌కు చెందిన సాగర్ల రంజీత్‌, చొప్పదండికి చెందిన బొడిగే స్ర్కాప్‌ వ్యాపారి సంపత్‌(రిసీవర్‌)ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక బొలెరో వాహనం, అశోక లేల్యాండ్‌ వాహనం, ద్విచక్రవాహనం, 3 క్వింటాళ్ల కాపర్‌ వైరు స్వాధీనం చేసుకున్నామని, వాటి మొత్తం విలువ సుమారు రూ.20 లక్షలుగా ఉంటుందని సీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కేసులకు సంబంధించి పరారీలో ఉన్న మిగతా 8 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఫ పోలీసు బృందానికి సీపీ అభినందనలు

కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ కుమార్‌ నేతృత్వంలో కేసులను ఛేదించగా బంృదంలోని ప్రదీప్‌ కుమార్‌(సీఐ చొప్పదండి), సంజీవ్‌(సీఐ మానకొండూర్‌), నరేష్‌ రెడ్డి(ఎస్సై), వంశీ కృష్ణ(ఎస్సై గంగాధర) సిబ్బంది అనిల్‌, రాజ్‌ నాయక్‌, హేమసుందర్‌, శ్రీనివాస్‌, హసనొద్దీన్‌, రవీందర్‌, సృజన్‌ను సీపీ గౌస్‌ ఆలం అభినందించారు.

Updated Date - Nov 15 , 2025 | 11:57 PM