Share News

siricilla : ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం

ABN , Publish Date - Mar 10 , 2025 | 01:01 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు రాయితీ ఇచ్చినా అనుకున్న స్థాయిలో స్పందన లేకపో వడంతో ప్రభుత్వం దరఖాస్తుదారుల్లో అవ గాహన పెంచే విధంగా చర్యలు చేపట్టింది.

siricilla :  ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం

- జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు రాయితీ ఇచ్చినా అనుకున్న స్థాయిలో స్పందన లేకపో వడంతో ప్రభుత్వం దరఖాస్తుదారుల్లో అవ గాహన పెంచే విధంగా చర్యలు చేపట్టింది. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన పెంచే దిశగా దిశానిర్ధేశం చేశారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌పై సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో రియల్‌ ఎస్టేట్‌ నిర్వాహకులు, ఏజెంట్లు, లే అవుట్‌లు వేసిన యజమానులకు అవగాహన కల్పించనున్నారు. సదస్సులను జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పట్టణ ప్రణాళిక అఽధికారులు పాల్గొననున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేపట్టారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా 42942 దరఖాస్తులు రాగా 37,071 దరఖాస్తులు పరిశీలించారు. 4,796 దరఖాస్తులు తిరస్క రించారు. 975 దరఖాస్తుల ఫీజులు చెల్లిం చారు. 37,071 మంది దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించి తమ ప్లాట్‌లను క్రమబధ్దీక రించుకోవాలని అధికారులు సమాచారం అం దించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 25 శాతం రాయితీ ప్రకటించినా దరఖాస్తు దారు లు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో భూముల ధరలు అశాజనకంగా లేకపోవడం, అమ్మకాలు లేకపో వడం, భూ సంబంధ వివాదాలు కేసులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడం వంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అవగాహన కార్యాక్రమాల ద్వారా దరఖాస్తుదారులను ప్రోత్సహించాలని ప్రభు త్వం అదేశాలు జారీ చేసింది. ఇందుకు సం బంధించి శుక్రవారం పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌ మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఖాళీ స్థలాల ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ కల్పించడం, సబ్‌ రిజిస్ట్రార్‌ లు నూతన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు స్వీకరిం చే విధంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశా లు ఇచ్చారు. అవగాహన సదస్సులు నిర్వహిం చి వేగవంతం చేయాలని భావిస్తున్నారు.

క్రమబద్ధీకరణకు ఎదురు చూపులు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణకువచ్చిన 42,942 దరఖాస్తుల్లో 37,071 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. 4,896 దరఖాస్తులు తిరస్కరించగా 975 మం ది ఫీజులు చెల్లించారు. సిరిసిల్ల మున్సి పాలిటీలో 10,493 దరఖాస్తులు రాగా 8,038 దరఖాస్తులు పరిష్కరించారు. 2,386 దర ఖాస్తులు తిరస్కరించారు. 69 దరఖాస్తుదారు లు ఫీజులు చెల్లించారు. వేములవాడ మున్సి పాలిటీ పరిధిలో 16,336 దరఖాస్తులు రాగా 14,676 దరఖాస్తులు పరిష్కరించారు. 1,632 దరఖాస్తులు తిరస్కరించారు. 28 దరఖాస్తు దారులు ఫీజులు చెల్లించారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా 1,6113 దరఖా స్తులు వచ్చాయి. వీటిలో 14,357 దరఖాస్తులు పరిష్కరించారు. 878 దరఖాస్తులు తిరస్క రించారు. 878 మంది దరఖాస్తుదారులు ఫీజు లు చెల్లించారు.. ఒక్కో ప్లాట్‌కు గత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కనీసం రూ. 20 నుంచి రూ. 50 వేల వరకు అదాయం లభిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వానికి కనీసం రూ. 40 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తు న్నారు. జిల్లాలో ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం వచ్చిన దరఖాస్తుల్లో సిరిసిల్ల మున్సిపాల్టీలో 10వేల 493 దరఖాస్తులు, వేములవాడ మున్సిపాల్టీలో 16,336 దరఖా స్తులు వచ్చాయి. గ్రామపంచాయతీల్లో వచ్చిన దరఖాస్తుల్లో బోయినపల్లి మండలంలో 20 గ్రామపంచాయతీల్లో 645 దరఖాస్తులు, చందుర్తిలో 15 గ్రామపంచాయతీల్లో 213 దరఖాస్తులు, ఇల్లంతకుంటలో 24 గ్రామ పంచాయతీల్లో 1,054 దరఖాస్తులు, గంభీ రావుపేటలో 17 గ్రామపంచాయతీల్లో 861 దరఖాస్తులు, కోనరావుపేటలో 15 గ్రామ పంచాయతీల్లో 277 దరఖాస్తులు, వేము లవాడ అర్బన్‌ మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీల్లో 3,702 దరఖాస్తులు, ముస్తా బాద్‌ మండలంలో 1,074 దరఖాస్తులు, ఎల్లారెడ్డిపేట మండలంలో 16 గ్రామపంచా యతీల్లో 3,949 దరఖాస్తులు, తంగళ్లపల్లిలో 26 గ్రామపంచాయతీల్లో 3,784 దరఖాస్తులు, వేములవాడ రూరల్‌ మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో 214 దరఖాస్తులు, రుద్రంగిలో రెండు గ్రామపంచాయతీల్లో 304 దరఖాస్తులు, వీర్నపల్లిలో మూడు గ్రామ పంచాయతీల్లో 71 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీల నకు క్లస్టర్‌లుగా విభజించి వెయ్యి దరఖా స్తులకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దర ఖాస్తుల పరిశీలన చేపట్టారు. అధికారులు ఇతర సర్వేలు రావడంతో పెండింగ్‌లోనే పడిపోయింది. క్రమబద్ధీకరణ కోసం దాదాపు ఐదేండ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

Updated Date - Mar 10 , 2025 | 01:01 AM