బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మౌన దీక్ష
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:12 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం మౌన దీక్ష నిర్వహించారు.
సైదాపూర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి పెసరు కుమారస్వామి మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేసేవరకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జంపాల భూపతి, సోమారపు రాజయ్య, నీర్ల సతీష్, నెల్లి శ్రీనివాస్, ఆడెపు రాజు, పరకాల నారాయణ, నెల్లి సంపత్ , మహిపాల్ సింగ్, స్వామిు పాల్గొన్నారు.