Share News

లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:53 AM

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపై లైంగిక వేధింపులు జరగకుండా పరిశ్రమల యజమా నులతో పాటు అధికారులు చూడాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ఆదేశించారు.

లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపై లైంగిక వేధింపులు జరగకుండా పరిశ్రమల యజమా నులతో పాటు అధికారులు చూడాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పని ప్రదే శంలో అంతర్గత కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధి లోని పెద్దూర్‌ శివారులోని అపరెల్‌ పార్కులోని పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ లో కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఆవరణలో అంతర్గత కమిటీ పనితీరును పరిశీ లించారు. కార్మికులతో మాట్లాడి వారికి అందు తున్న ప్రయోజనాలు, పని ప్రదేశంలో స్థితిగతు ల గురించి పరిశీలించారు. అలాగే మేనేజ్‌మెంట్‌ సభ్యులతో మాట్లాడి ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక వాతావరణంలో పని ప్రదేశం ఉండా లని సూచించారు. పని ప్రదేశంలో సరైన భద్ర తా చర్యలు చేపట్టడంతో పాటు మానసిక ఉల్లా సానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే క్రచ్‌ పిల్లల డేకేర్‌ సెంటర్‌లో పిల్లలకి అందుతు న్న సేవలను లక్ష్మీరాజం పరిశీలించారు.

Updated Date - Dec 06 , 2025 | 12:53 AM