జిల్లా వ్యాప్తంగా సేవాపక్షం కార్యక్రమాలను నిర్వహించాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:57 AM
మంత్రి నరేంద్రమోదీ జన్మది నం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీవరకు సేవాపక్షం కార్యక్ర మాలను జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మంత్రి నరేంద్రమోదీ జన్మది నం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీవరకు సేవాపక్షం కార్యక్ర మాలను జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయిలో కార్యశాలను కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథి గా హాజరైన గోపి మాట్లాడుతూ స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరం, పేదలకు, దివ్యాం గులకు సహకరించడం వంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెన్నమనేని వికాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, పార్లమెంట్ కో-కన్వీనర్ అడెపు రవీం దర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, ఓబీ సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కు దేవేందర్‌యాదవ్, జిల్లా ప్రధాన కార్య దర్శి పోన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, బర్కం వెంకటలక్ష్మీ, సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్ కారెడ్ల మల్లారెడ్డి, సంతోష్‌బాబు, కా ర్తీక్‌రెడ్డి, మానుక కుమార్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.