Share News

చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపడం చెంపపెట్టు..

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:20 AM

సోనియాగాంధీ, రాహాల్‌గాంధీలపై పెట్టిన కేసుల చార్జ్‌షీట్‌ ను కోర్టు వెనక్కి పంపడం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకి చెంపపెట్టని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపడం చెంపపెట్టు..

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : సోనియాగాంధీ, రాహాల్‌గాంధీలపై పెట్టిన కేసుల చార్జ్‌షీట్‌ ను కోర్టు వెనక్కి పంపడం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకి చెంపపెట్టని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ కేసులను కోర్టు తప్పుబట్టి కోర్టు చార్జ్‌షీట్‌ను వెనక్కిపంపడంతో బీజేపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా గురువారం కాంగ్రెస్‌ శ్రేణలు ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను అక్రమంగా ఈడీ ద్వారా కేసులు పెట్టించి అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. చార్జ్‌షీట్‌ ద్వారా వీరిని దోషులు గా తేల్చే ప్రయత్నం చేయగా ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఆధారంగా కేసుల ఎలా పెడతారని ఢిల్లీ కోర్టు చార్జ్‌షీట్‌ ను తిరస్కరించిందంటే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎలాంటి పొరపాటు చేయలేదని దేశం యావత్తు అంగీ రించిందన్నారు. కోర్టు చార్జ్‌షీట్‌ను తిప్పికొట్టిన వేళ భార తీయ జనతాపార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. నరేంద్ర మోదీ,అమీత్‌షాల కుట్రలు విఫలమైన వేళ భారత దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని గద్దెదిగాలని డిమాండ్‌ చేశారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన కుటుం బం నుంచి వచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి రెండుసార్లు ప్రధాన మంత్రి పదవి అవకాశాలు వచ్చిన పదవులు ముఖ్యం కాదు, దేశానికి సేవలందించాలని మన్మోహన్‌సింగ్‌ను రెండుసార్లు ప్రధానమంత్రి చేసిన చరిత్ర వారిదని వారినే అక్రమంగా జైలుకు పంపాలని చూడడం తగదన్నారు. సోనియగాంధీ, రాహుల్‌గాంధీని టచ్‌ చేయాలని చూస్తే ఊరుకోమని వారి వెంట కాం గ్రెస్‌ పార్టీ ఉంటుందని అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షు డు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం ఈడీ అనే భూతంతో కాంగ్రెస్‌ అగ్రనాయ కులను భయపెట్టాలని చూస్తోందన్నారు. గత 11సంవ త్సరాలుగా బీజేపీ ప్రభుత్వం బ్లాక్‌మైల్‌ రాజకీయాలు చేస్తూ అప్రజస్వామికమైన కేసులు పెడుతోందని ఆరో పించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపైన బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ ద్వారా అక్రమ కేసులు పెట్టిస్తూ నాయకుల ను మానసికంగా నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుం దన్నారు. మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్తుంజయం మా ట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేస్తున్న కుటుంబం పైన నిందలు వేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్ని స్తుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథా లయం చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమి టీ చైర్‌పర్సన్లు వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, లచ్చయ్య, తిరుపతి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరి సిల్ల, వేములవాడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు చొప్పదం డి ప్రకాష్‌, చంద్రగిరి శ్రీనివాస్‌, సిరిసిల్ల పట్టణ ఉపాధ్య క్షుడు బొప్ప దేవయ్య, సిరిసిల్ల, వేములవాడ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సూర దేవరాజు, వెంకటస్వామి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాగా, ధర్నాలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ధర్నాను అడ్డు కోవడం కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాం గ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ వాతవరణం ఉదృతంగా మారింది. అటూ బీజేపీ ఇటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాహా బాహీకి దిగడంతో ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకో వడంతో తోపులాట జరగగా, ఓ కాంగ్రెస్‌ కార్యకర్తకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ మహేష్‌ బీ. గితే, డీఎస్పీ నాగేంద్రచారి నాయకులతో మాట్లాడి ధర్నా కార్యక్రమాన్ని త్వరగా ముగింప జేశారు.

Updated Date - Dec 19 , 2025 | 12:20 AM