Share News

మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరం...

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:04 AM

మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగటం నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి కె వెంకటేష్‌ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌ సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్‌ ఓనర్స్‌ సొసైటీ భవనంలో చట్టాలపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు.

మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరం...
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్‌

కరీంనగర్‌ క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగటం నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి కె వెంకటేష్‌ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌ సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్‌ ఓనర్స్‌ సొసైటీ భవనంలో చట్టాలపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్‌ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలపై వివరించారు. పొగాకు వాడడం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరిగిపోతుంద తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని, చట్టప్రకారం జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్మికులతో పొగాకు వాడడం తగ్గించడంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ తణుకు మహేష్‌, జేఏసీ అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్‌, నారాయణ, మీస రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:05 AM