Share News

స్వయం సహాయక సభ్యులను ఓపెన్‌ స్కూల్‌లో చేర్పించాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:14 AM

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారిని పదవ తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్లో చేర్పించి, వారిని మరింత విద్యావంతులుగా తీర్చిది ద్దాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్లో విద్యాశాఖ సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది.

స్వయం సహాయక సభ్యులను ఓపెన్‌ స్కూల్‌లో చేర్పించాలి

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారిని పదవ తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్లో చేర్పించి, వారిని మరింత విద్యావంతులుగా తీర్చిది ద్దాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్లో విద్యాశాఖ సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా గ్రూపులలోని సభ్యుల్లో అర్హతను బట్టి పదవ తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్లో ప్రవేశాలు పొందేలా చూడా లన్నారు. పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లమెంటరీలో జిల్లా నుంచి 270 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 267 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, వసతు లు, వినూత్న రీతిలో బోధన విధానం వంటి అంశాలను వారికి వివరించాలని సూచించారు. ఒకే ప్రాంగణంలో ఉండే అంగన్వాడి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు నూరు శాతం మంది ఆ ప్రాంగణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ప్రవేశం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యాశాఖ తరఫున యూట్యూబ్‌ ఛానల్‌ని స్థాపించాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈ ఛానల్‌ ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలలు, క్రీడా పాఠశాల, అంధుల పాఠశాల, కేజీబీవీలు భవిత కేంద్రాల్లో మోడల్‌ స్కూల్‌లో జరిగే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. భవిత కేంద్రాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. మానసిక, శారీరక దివ్యాంగులకు భవిత కేంద్రాల ద్వారా విద్యని అందిస్తున్న విషయా న్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీధర్‌, మెప్మా పీడీ వేణు మాధవ్‌, డీఈవో మొండయ్య, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్‌ రాంబాబు, జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కోఆర్డినేటర్లు ఆంజనేయులు, మిల్కూరి శ్రీని వాస్‌, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

మీ సేవలో అధిక ఫీజులు వసూలు చేస్తే రిజిస్ర్టేషన్లు రద్దు

కరీంనగర్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మీ సేవలో అధిక ఫీజులు వసూలు చేస్తే మీసేవా నిర్వాహకుల రిజిస్ర్టేషన్లను రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కొన్ని మీసేవా కేంద్రాల్లో పదవ తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి చెల్లించాల్సిన ఫీజుకన్నా అదనంగా 300 రూపాయల వరకు మీసేవా నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి ఫిర్యాదులు వస్తే మీసేవా నిర్వాహకుల రిజిస్ర్టేషన్లు రద్దు చేస్తామని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్‌ దూరవిద్యలో దరఖాస్తు చేసుకునేందుకు మీసేవలో ఫీజుకన్నా అదనంగా డబ్బులు డిమాం డ్‌ చేస్తే 0878-2997247 నెంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Jun 28 , 2025 | 12:14 AM