మలి విడత పోలింగ్ ప్రశాంతం
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:44 AM
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి.
ఇల్లంతకుంట, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. మండలంలో 35 సర్పంచ్ స్థానాలు, 294వార్డుసభ్యుల స్థానాలు ఉండగా 8 సర్పంచ్, 104వార్డుసభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 27సర్పంచ్, 190వార్డుస్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. మండలంలో 35932 మంది ఓటర్లు ఉండగా30584 మంది ఞటర్లుతమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 85012గానమోదు అయ్యింది. ఇల్లంతకుంట, పెద్దలింగాపూర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మహేష్‌బిగితే పరిశీలించి, వృద్ధ ఓటర్లను పలుకరించారు. పోలింగ్ కేంద్రానికి 200మీటర్ల దూరం వరకు ఎవరు రావద్దనే నిబంధనలు పోలీసులు అమలుచేయడంతో ఓటువేయడానికి వృద్ధ ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఓటర్లను వాహనాలలో అభ్యర్థులు తరలించగా, ఓటువేయాలని అభ్యర్థుల మద్దతుదారులు పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. తాళ్ళపెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గదులు లేకపోవడం వల్ల టెంట్లు కింద పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మండంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేశారు. వంతడుపుల గ్రామంలో సావనపెల్లి రాజయ్య, రాజవ్వఅనే వృద్ధ దంపతులు కలిసివచ్చి ఓటువేసి ఆదర్శంగా నిలిచారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న యువతులు సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు.
తంగళ్లపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో విడత గ్రామ పంచా యతీ ఎన్నికలు తంగళ్లపల్లి మండలంలో ప్రశాంతంగా జరిగింది. తంగళ్లప ల్లి మండలంలో 27 సర్పంచ్ స్థానాలకు 174 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే మూడు సర్పంచ్ స్థానాలు వేణుగోపాల్‌పూర్, గండి లచ్చపేట, బాలమల్లుపల్లెలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 78 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలో 38468 ఓటర్లు ఉండగా 32111 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 83.47శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 30 స్థానాల్లో బీఆర్‌ఎస్ 16, కాంగ్రెస్ 7, బీజేపీ 4, స్వతంత్రులు మూడు గెలుపొందారు. తంగళ్లపల్లిలో 12,13 పోలింగ్ కేంద్రా లకు వెళ్లడానికి ర్యాంప్ లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందు లు పడ్డారు. కేసీఆర్ నగర్‌లో డబుల్ బెడ్‌రూంల మధ్య రెండు పోలీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సమయం దాటుతుండగా భారీగా ఒటర్లు చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది. కాలనీకి వచ్చే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో ఇళ్లలోకి వెళ్లే వారు ఇబ్బందులుపడ్డారు. దీంతో పోలీసు లకు కాలనీ వాసులకు వాగ్వాదం తలెత్తింది. మధ్యహ్నం 12 గంటల వరకు పోలీంగ్ మందకొడిగా సాగింది. సమయం దగ్గర పడుతుండగా ఒక్కసారిగా కాలనీ ఇళ్ల నుంచి సుమారు 500 మంది ఓటర్లు కేంద్రాలకు చేరుకోగానే అధికారులు అవాక్కయ్యారు. వారిని కంట్రోలు చేయలేక మరోవైపు కాలనీ ప్రధానద్వారం మూసివేశారు. కేంద్ర వద్దకు చేరుకున్న వారికి టోకన్లు జారీ చేసి ప్రధాన ద్వారం తెరి చారు. రామన్నపల్లె పోలింగ్ కేంద్రంలో సరిపోయే గదులు లేకపోవడంతో వరం డా, ఆరుబయట టెంట్ వేసి కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిం చారు. కాగా, మండలం కేంద్రంలో ఉన్నత పాఠశాల అవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌స్టేషన్‌ను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీ లించారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత చేపట్టనున్న ఓట్లలెక్కింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. అలాగే సారంపల్లి, తంగళ్లపల్లి, మండేపల్లి పోలింగ్ స్టేషన్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. ఆయా కార్యక్రమ ల్లో ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ జయంత్‌కుమార్ పాల్గొన్నారు.
తంగళ్లపల్లి మండలంలోని తంగళ్లపల్లి, జిల్లెల్ల పోలీంగ్ కేంద్రాలను ఎస్పీ మహేష్ బి గితే పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. పోలీంగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో ఎక్కాడ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంత రం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట రూరల్ సీఐ మొగిలి ఉన్నారు.
బోయినపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : బోయినపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీల్లో 30,505 ఓటర్లు ఉన్నారు. ఇందులో 25,858 మంది ఓటు హక్కును వినియోగించుకుగా 84.77శాతం నమోదయింది. ఎన్నికల నీలోజిపల్లి, కొదురుపాక, విలాసాగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మహేష్ బిగి తే పరిశీలించారు. కోరెంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.