రెండో విడత ప్రశాంతం
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:37 AM
జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. నాలుగు మండలాల్లో 84.15 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 1,12,658 ఓటర్లకు గాను 94,807 ఓటు వేశారు. ఇందులో పురుషులు 47,029 మంది 84.60 శాతం, మహి ళలు 47,775 మంది 83.72 శాతం, ఇతరులు ముగ్గురు ఓటర్లు ఓట్లు వేశారు. అత్యధికంగా అంతర్గాం మండలంలో పోలింగ్ 86.20 శాతం, అత్యల్పంగా దర్మారం మండలంలో పోలింగ్ 82.88 శాతం నమోదైంది. జూలపల్లిలో 85.21 శాతం, పాలకుర్తి మండలంలో 83.88 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామ పంచా యతీల్లో పోలింగ్ ప్రారంభమైంది. వార్డుల వారీగా పోలింగ్ బూతులు ఉండడంతో ఓటర్లు తమ వార్డులకు వెళ్లి లైన్‌లో నిలబడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట పోలింగ్ సమయం ముగిసే వరకు ప్రాంగణంలో ఉన్న వాళ్లు ఓట్లు వేసేందుకు అవకా శం కల్పించారు. చలికాలం కావడంతో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. 9 గంటల తర్వాత ఒక్కరొక్కరుగా కేంద్రాలకు చేరుకోవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 12 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరే ఉన్నారు. ధర్మారం, పుట్నూర్, జూల పల్లి, బసంత్‌నగర్, పాలకుర్తి, అంతర్గాం వంటి పంచా యతీల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 9 గంటల వరకు 23.94 శాతం, 11 గంటల వరకు 55.20 శాతం, మధ్యాహ్నాం ఒంటి గంట వరకు 80.84 శాతం, మొత్తం పోలింగ్ ముగిసే వరకు 84.15 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఫ 73 పంచాయతీల్లో పోలింగ్..
రెండో విడతలో అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, 684 వార్డు స్థానాలకు గత నెల 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ధర్మారం మండలం బంజేరుపల్లి, బొట్ల వనపర్తి, నాయకంపల్లి సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. నాలుగు మండలాల్లో కలిసి 177 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 73 గ్రామ పంచాయతీల్లో 70 సర్పంచ్ స్థానాలకు, 504 వార్డు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. 70 సర్పంచ్ స్థానాలకు 286 మంది అభ్యర్థులు, 504 వార్డు స్థానాలకు 1454 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఎన్నికల నిర్వహణ కోసం 684 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి 1031 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 39 కేంద్రాలను సమ స్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అభ్యర్థుల తరపున మద్దతుదారులు తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ గుర్తులు చూపెడుతూ అభ్యర్థించారు. కొం దరు అభ్యర్థులు నిజమైన గుర్తులను తీసుక వచ్చి ప్రచారం చేశారు. పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల దూరం అవతలనే అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకునేలా కట్టుదిట్టం చేశారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఓటర్లు తమ పనులను పక్కన బెట్టి ఓటింగ్‌లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లు సైతం గ్రామాలకు వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా మద్యం పారించడంతో పాటు ఓటర్లకు నోట్లు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆరంభం అయ్యింది. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రి యను పరిశీలించారు. డీసీపీ రాంరెడ్డి అంతర్గాం మండలం కుందనపల్లి, పెద్దంపేట్, ఎల్లంపల్లి, ముర్మూర్, గోలివాడ గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంథని మండలం గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి, తదితర పోలింగ్ కేంద్రా లను పరిశీలించి పోలీస్ బందోబస్తును పోలింగ్ సరళిని పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఫ మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు..
-----------------------------------------------------------------------------------------------------
మెత్తం ఓట్లు పోలైన ఓట్లు
-----------------------------------------------------------------------------------------------------------
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం శాతం
-------------------------------------------------------------------------------------------------------------------------------
1. అంతర్గాం 8807 9122 1 17930 7750 7705 0 15455 86.20
2. ధర్మారం 20869 21575 3 42447 17281 17894 3 35178 82.88
3. జూలపల్లి 11977 12186 0 24163 10270 10320 0 20590 85.21
4. పాలకుర్తి 13934 14184 0 28118 11728 11856 0 23584 83.88
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 55587 57067 4 112658 47029 47775 3 94807 84.15
------------------------------------------------------------------------------------------------------------- -------------------------