పారదర్శకంగా సీట్లను భర్తీ చేయాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:58 PM
తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని ఇన్‌చార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ అదేశించారు.
సిరిసిల్ల రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని ఇన్‌చార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ అదేశించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం మిగిలి న సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. సాంఘిక సంక్షేమ గురుకులంలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన ఉన్న సీట్ల భర్తీకి ఇటీవల దరఖాస్తులను ఆహాన్విం చగా మంగళవారం చేపట్టిన కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. పాఠశాలలో ఏ ర్పాటు చేసిన వివిధ డెస్క్‌లు, సర్టిఫికెట్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకు లాల కో-అర్టినేటర్ జేజే థేరిస్సా తదితరులు పాల్గొన్నారు.