Share News

మానవ అభివృద్ధికి సైన్స్‌ దోహదం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:38 AM

మానవ అభివృద్ధికి సైన్స్‌ నిత్య నూతన ఆవిష్కరణలు చేస్తూ మానవాళికి ఎంతో దోహదపడుతుందని - జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్‌ అన్నారు.

మానవ అభివృద్ధికి సైన్స్‌ దోహదం

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మానవ అభివృద్ధికి సైన్స్‌ నిత్య నూతన ఆవిష్కరణలు చేస్తూ మానవాళికి ఎంతో దోహదపడుతుందని - జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రంగినేని ట్రస్టులో జిల్లాస్థాయి చెకుముకి టా లెంట్‌ టెస్టు-2025 పోటీలను జిల్లా అధ్యక్షుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక 36 సంవత్సరాలుగా శాస్త్రీయ ప్రచా రం చేస్తూ విద్యార్థులలో శాస్త్రీయా దృక్పఽథాన్ని నింపడానికి అనేక కార్యక్రమాల ను నిర్వహిస్తోందన్నారు. జన విజ్ఞాన వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామరా జు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక సైన్స్‌నే ప్రచారం చేస్తుందని అన్నారు. సీవీ రామన్‌ జయంతి సందర్భంగా చెకుముకి టాలెంట్‌ టెస్టులను నిర్వహిస్తుందన్నా రు. పర్యావరణ పరిరక్షణ, మూఢ నమ్మకాల నిర్మూలన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను, విద్యార్థులను చైతన్యపరుస్తోందన్నారు. జిల్లాలోని 13 మండలాల నుంచి విద్యార్థులు టాలెంట్‌ టెస్టుకు హాజరయ్యారన్నారు. విజేత లైన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు, మెమోంటోలను అందజేసి అభినందిం చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షులు బురక గోపాల్‌, శ్రీహరి, కార్యదర్శి రాజలింగం, కోశాధికారి మేడపట్ల కిషన్‌, రచయిత కందేపి రాణిప్రసాద్‌, మార్వాడి గంగ రాజు, సందానందం, బాలరాజు, మద్దికుంట లక్ష్మన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:38 AM