Share News

రైల్వే లైన్‌ నిర్వాసితులకు పెండింగ్‌ పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:52 AM

కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ భూ సేకరణ పెండింగ్‌ పరిహారం త్వరగా చెల్లిం చాలని క్యాబినేట్‌ సెంట్రల్‌ సెక్రెటరీ కలెక్టర్‌కు సూచించారు.

రైల్వే లైన్‌ నిర్వాసితులకు పెండింగ్‌ పరిహారం చెల్లించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యో తి): కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ భూ సేకరణ పెండింగ్‌ పరిహారం త్వరగా చెల్లిం చాలని క్యాబినేట్‌ సెంట్రల్‌ సెక్రెటరీ కలెక్టర్‌కు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగి న వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ నుంచి సెంట్ర ల్‌ సెక్రెటరీ కొత్తపల్లి-మనోహరాబాద్‌ అభివృ ద్ధి పనుల్లో పెండింగ్‌ భూసేకరణ పరిహారం చెల్లింపుల స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మనోహరా బాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల రైల్వేలైన్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా భూ సేకరణ పెండింగ్‌ పరిహారం చెల్లింపులు సం బంధిత లబ్ధిదారులకు అందించాలని వివరిం చారు. సిద్ధిపేట, మెదక్‌, కరీంగనర్‌, సిరిసిల్ల జిల్లాలను సిక్రింద్రాబాద్‌ రైల్వేలైన్‌ కలపడం వల్ల పారిశ్రామికంగా ఈ ప్రాంతాలు అభివృ ద్ధి చెందుతాయని మనోహారాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32కిలోమీటర్లు, గజ్వేల్‌ నుంచి సిద్ధిపేట వరకు 40 కిలోమీటర్లు, సిద్ధిపేట నుంచి సిరిసిల్లకు 40.80కిలోమీటర్లు, సిరిసిల్ల నుంచి కొత్తపల్లికి 39 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పనులు నాలుగు దశ లో చేయడం జరుగు తుందని ప్రస్తుతం రెండవ దశ పనులు జరుగుతున్నాయని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ రైల్వే లైన్‌కు సంబంధించి సిరిసిల్ల జిల్లాలో 40 కిలోమీటర్ల మేర ఉందని దీనికి సంబంధించి 386.21 హెక్టార్ల భూసేకరణ చే యాల్సిఉండగా ప్రస్తుతం 342.46 హెక్టార్ల భూమిని సేకరించి రైల్వే శాఖకు బదిలీ చేశామని అన్నారు. పెండింగ్‌లో ఉన్నా 43.42 హెక్టార్ల భూ సేకరణలో భాగంగా 15.21 హెక్టార్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమిని రైల్వే శాఖకు అప్పగించామని దా నికి బదులు అటవీశాఖకు కోనరా వుపేట మండలంలోని కొండాపూ ర్‌లో 38ఎకరాల 5గుంటల భూమి ని అందించామన్నారు. పెండింగ్‌ భూసేకరణకు 68.80కోట్లు పీడీ అ కౌంట్‌లో జమ అయ్యాయని భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తున్నామనిన్నారు. పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు నాయక్‌, కలెక్టరేట్‌ సూపరింటెం డెంట్‌ శ్రీకాంత్‌ పాల్గన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:52 AM