స్కానింగ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:49 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై కఠినచర్యలు తీసుకోవాలని, నిరం తరం స్కానింగ్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలని వైద్య అరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై కఠినచర్యలు తీసుకోవాలని, నిరం తరం స్కానింగ్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలని వైద్య అరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి జిల్లా వైద్య అరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ కేంద్రాలపై పర్యవేక్షించాలని బ్రూణ హాత్యలు జరగకుండా పకడ్బందీగా చర్యలుతీసుకోవానలి అన్నారు. పీసీ ఎన్‌బీ యాక్ట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా సలహా కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధికం గా ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాధార ణ ప్రసవాలను ప్రొత్సహించాలని, అత్యవసర సమయంలోనే సీ సెక్షన్ అపరేషన్లు నిర్వహించాలన్నారు. జిల్లాలో నూతన ఆసుపత్రుల ఏర్పా టుకు రిజిస్ట్రేషన్ పక్రియ కలెక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే జరగాలన్నా రు. నూతన స్కానింగ్ కేంద్రాలు, పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు కమిషనర్ అనుమతి తప్పనిసరి అని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది మందుల కోరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరాలకు అనుగుణంగా స్పెషలిస్ట్ డాక్టర్లను ఎప్పటికప్పుడు నియ మించుకోవాలని, వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులు ప్ర భుత్వం వద్ద ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అందు బాటులో ఉన్న మందుల వివరాలను వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్నారు. అందుబాటులో ఉన్న మందులను మాత్రమే రోగులకు అందించాలని రోగులు అనవసరంగా ప్రైవేటుగా మందులు కోనాల్సిన అవసరం రావద్దని అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్, టీ హాబ్ వివరాలు తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారానే పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రేడియాలజీ విభాగానికి సంబంధించి పరీక్షల నివేదికలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రజిత, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పెంచలయ్య, పోగ్రాం అధికారు లు పాల్గొన్నారు.