Share News

ఘనంగా సత్యసాయిబాబా శతజయంతి

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:52 PM

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సత్యసాయిబాబా శతజయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడాల శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాల అధికారి రాందాస్‌, ఎస్సీ కార్పొ రేషన్‌ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఫ సిరిసిల్ల రూరల్‌ : పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు అదివారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో పుట్టపర్తి సత్యసాయిబాబా చిత్రపటానికి ఎస్పీ మహేష్‌ బీ గీతే పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు మధుకర్‌, యాదగిరి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌; అడ్మినిస్త్రేషన్‌ అధికారి పద్మ, అర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

17వ పోలీస్‌ బెటాలియన్‌లో...

సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ పోలీస్‌ బెటాలియన్‌లో అదివారం పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్‌లో సత్యసాయిబాబా చిత్రపటానికి బెటాలియన్‌ కమాండెంట్‌ ఎంఐ సురేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాం డెంట్‌ జగదీశ్వర్‌రావు, ఆర్‌ఐ కుమారస్వామి, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:52 PM