Share News

సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:41 AM

సమ సమాజం కోసం, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అన్నారు.

సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : సమ సమాజం కోసం, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అన్నారు. కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా సర్ధార్‌ సర్వా యి పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. కలె క్టరేట్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా జిల్లా అధికారులు, గౌడ సంఘం నాయకులు పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌మాట్లాడుతూ తెలంగాణ వీరత్వా నికి ప్రతీకగా పాపన్నగౌడ్‌ నిలిచాడన్నారు. కార్యక్రమంలో జిల్లా గంథ్రాల య సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, బీసీ సంక్షేమ శాఖ ఇన్‌ చార్జి అధికారి సౌజన్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కార్మికశాఖ అధి కారి నజీర్‌అహ్మద్‌, జిల్లా యువజన క్రీడలఅధికారి రాందాస్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మల్లికార్జునరావు, బుర్ర నారాయణ గౌడ్‌, లక్ష్మీపతిగౌడ్‌, సుద్దాల శ్రీనివాస్‌గౌడ్‌, బుర్ర రామచంద్రంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:42 AM