Share News

పండుగ వాతావరణంలో చీరలు పంపిణీ చేయాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:57 AM

జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి చీరలను అర్హులైన మహిళలందరికి పంపిణీ చేయాలని కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

పండుగ వాతావరణంలో చీరలు పంపిణీ చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి చీరలను అర్హులైన మహిళలందరికి పంపిణీ చేయాలని కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ సచివాలయం నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సేక్రటరీ శైలాజ రామయ్యర్‌లో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమా అగ్రవాల్‌, జిల్లా అధికారులతో చీరల పంపిణీపై చర్చిం చారు. ఈ సందర్భంగా సీఎం మాట్టాడుతూ భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని మహిళ లందరికి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసి అర్హులైన మహిళలందరికి అందిం చేందు తగిన ప్రణాళికలను రూపొందించుకుని పంపిణీ చేయాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన అడపడుచులందరికి చీరలను అందించాలన్నారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఈ చీరల వల్ల అత్మ గౌరం పెరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారిగా ప్రత్యేక అధికారులను నియమించి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టల న్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాల న్నారు. మహిళ అభ్యున్నతి ధేయ్యంగా ప్రజా ప్రభుత్వం ధృడ సంక ల్పంతో పనిచేస్తుందని సీఎం అన్నారు. మహిళలకు వడ్డీలేనిరుణాలు, ఇచ్చి వారిని పోత్సహిస్తుందని వివరించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లు, పెట్రోల్‌ బంక్‌లు, అమ్మ అదర్శపాఠశాలల పనులు, సోలా ర్‌ ప్లాంట్‌ల నిర్వహణతోపాటు అనేక రంగాల్లో మహిళలను ప్రోత్స హిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా వారిని బస్సులకు యాజమానులు చేయడానికి అద్దె బస్సు లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2034 సంవత్సరానికి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ప్రకటించారు.

జిల్లా వ్యాప్తంగా చీరల పంపిణీ ప్రణాళికలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ తెలిపారు. నియోజకవర్గానికి, మండలానికి, గ్రామాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పా టు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు చీరలను తరలించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహిళలకు చీరలను అందించాలని కోరారు. ఈ వీడియో కానరెన్స్‌లో డీఆర్‌డీవో శేషాద్రి, అడిషనల్‌ డీఆర్‌డీవో శ్రీని వాస్‌, చేనేత జౌళీశాఖ ఏడీ రాఘవరావు, డీపీవో షర్పీద్దున్‌, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, వేములవాడ మున్సిపల్‌ మేనేజర్‌ సంపత్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, మెప్మ ఏవో మీర్జా ఫసహ త్‌ అలీబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:57 AM