Share News

దేశ సమగ్రతకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:12 AM

దేశ ఐక్య త, సమగ్రతకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి చిరస్మరణీ మని ఎస్పీ మహేష్‌ బీ గితే అన్నారు.

దేశ సమగ్రతకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : దేశ ఐక్య త, సమగ్రతకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి చిరస్మరణీ మని ఎస్పీ మహేష్‌ బీ గితే అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం లో శుక్రవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భం గా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమా న్ని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్‌ వరకు నిర్వహించారు. ర్యాలీని ఎస్పీ మహేష్‌ బీ గితే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ ఘాట్‌లో విద్యార్థు లు, యువత, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన కృషి చరిత్రలో చిరస్మర ణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గ దర్శకమన్నారు. రన్‌ ఫర్‌ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యతపై ప్రజల్లో చైతన్యం పెంపొందుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్‌ కమాండెంట్‌ ఎంఐ సురేష్‌, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌లు రాందాస్‌, ఎస్‌ సురేష్‌, సీఐలు కృష్ణ, నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐలు మధుకర్‌, రమేష్‌, యాదగిరి, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, శ్రీకాం త్‌, శ్రావణ్‌యాదవ్‌, సాయి, శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో..

ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మహే ష్‌ బిగితే పాల్గొని పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు రవి, నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐలు రమేష్‌, మధుకర్‌, యా దగిరి, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, సాయికిరణ్‌, శ్రీనివాస్‌ తదిత రులు పాల్గొన్నారు.

17వ పోలీస్‌ బెటాలియన్‌లో..

సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ పోలీస్‌ బెటాలి యన్‌లో శుక్రవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. కమాండెం ట్‌ ఎంఐ సురేష్‌ పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం పోలీస్‌ అధికారు లు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు రాందాస్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:12 AM