సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:51 AM
సర్దార్ సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తి హర్షనీయమని ప్రభుత్వ విప్ వేములవా డ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : సర్దార్ సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తి హర్షనీయమని ప్రభుత్వ విప్ వేములవా డ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండల కేం ద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దా ర్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజనుల ఆకాంక్షకు కుల వృత్తులందరిని కలుపుకొని వారి అభివృద్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని కొనియాడారు. సర్వాయి పాపన్న చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఆయన విగ్రహ ఏర్పా టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ హైదరాబాద్ నడిబొడ్డున భూమి పూజ చేశారన్నారు. ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో ప్రభుత్వం ప్రజా పాలనను కొనసాగిస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వే షన్లను కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడ న్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారా యణ, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, జిల్లా నాయకుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, చందనగిరి గోపాల్, గొట్టే రుక్మిణి, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, గౌడ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, అబ్బసాని శంకర్‌గౌడ్, తాళ్లపెళ్లి శ్రీకాంత్, సతీష్, నందుగౌడ్, చంద్ర య్య గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయిని ప్రభాకర్‌రెడ్డి, నాగ రాజు, వెంగలి వెంకన్న, శ్రీనివాస్ రెడ్డితో పాటు గౌడ సంఘం నాయ కులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.