పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలి
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:22 AM
పట్టణాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టేలా సిబ్బంది చూడాలని సీడీఎంఏ డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వంద రోజుల పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు.
హుజూరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టేలా సిబ్బంది చూడాలని సీడీఎంఏ డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వంద రోజుల పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జమ్మికుంట రహదారి వెంట విద్యార్థులతో కలిసి మల్టీలేయర్ ప్లాంటేషన్ చేశారు. ఇప్పల్‌నర్సింగాపూర్‌లో ఉమెన్ ఫర్ ట్రీస్‌లో భాగంగా నాటిన 200 మొక్కలను పరిశీలించారు. కేసీ క్యాంపులో అమృత్ పథకం నిధులతో కడుతున్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి, మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని సిబ్బంది రోడ్ల మీద, ఇళ్ల చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవా లన్నారు. పారిశుధ్యం సక్రమంగా అమలయితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో వంద రోజుల ప్రణాళిక సక్రమంగా నిర్వహించారని మెచ్చుకున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన ఎక్స్‌కావేటర్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మేనేజర్ భూపాల్‌రెడ్డి, సుధాకర్, అభినవ్, అశ్వినీగాంధీ, సుధీర్, రమేష్, కుమారస్వామి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.