స్థానిక అవసరాలకు ఇసుక అందించాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:21 AM
జిల్లా కేంద్రంలో స్థానిక అవస రాల కోసం ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీందర్, పట్టణ మాజీ అధ్య క్షుడు నాగుల శ్రీనివాస్‌లు కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో స్థానిక అవస రాల కోసం ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీందర్, పట్టణ మాజీ అధ్య క్షుడు నాగుల శ్రీనివాస్‌లు కోరారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ఎం. హరితను కలిసి సమస్యలను విన్నవించి వినతిపత్రాన్ని అందించారు. ఈసం దర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో భవన నిర్మాణ రంగంలో స్థాని క అవసరాలకు ఇసుక ఇవ్వకపోవడం వల్ల పనులు లేక అనేక మంది కార్మికులు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కు అనుమతి పత్రాలను అందించిందని, కానీ వారికి ఇసుకను ఇవ్వకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో పేద ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ స్పందించి ఇసుకతోపాటు మట్టికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కైలాస్, ఎర్రం విజయ్, దూడం శివ తదితరులు పాల్గొన్నారు.