Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:46 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందివ్వాలని లబ్ధిదారులు ఆందో ళన చేపట్టారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలి

సిరిసిల్ల రూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందివ్వాలని లబ్ధిదారులు ఆందో ళన చేపట్టారు. ఇసుక కొరత ఏర్పడడంతో ట్రాక్టర్‌ యాజమానులు ఇదే అదనుగా భావించి ఒక ట్రిప్పునకు రూ 6వేలను తీసుకుంటున్నారని, ప్రభుత్వం స్పందించి ఉచి తంగా ఇసుకను అందించాలంటూ లబ్ధిదారులు ఆందోళనలు చేపట్టిన సంఘటన అది వారం సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చిన్నబోనాలలో చోటుచేసుకుంది. మున్సిపల్‌ పరిధి లోని 10వ వార్డు చిన్నబోనాల గ్రామంలో ఇళ్లు లేనివారికి ఇందిరమ్మ పథకం కింద రూ 5లక్షలతో 26 ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించా రు. అయితే సిరిసిల్ల మానేరు వాగునుంచి ఇసుకనుంచి ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంద ని ఆశించిన లబ్ధిదారులకు నిరాశనే మిగిలిపోయింది. ప్రభుత్వం ఉచిత ఇసుకకు అను మతులు ఇవ్వకపోవడంతో ఇసుకను రావాణా చేసే ట్రాక్టర్‌ యాజమానులు సిరిసిల్ల మానేరు వాగు నుంచి చిన్నబోనాల గ్రామానికి ఇసుకను తీసుకవస్తే ఒక ట్రిపునకు రూ 6వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి ఉచితంగా ఇసుకను అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలేంద్రి దేవయ్య, చలిమెల వెంకన్న, చల్ల శ్రీకాంత్‌, దువ్వాల లక్ష్మీ, బండారి రవి, పడిగే రాజనర్సు, తమ్మల సుధాకర్‌, బోనాల ప్రమోద్‌, సుమన్‌; బానోతు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:47 AM