ప్రతిరోజు ఇసుకకు అనుమతివ్వాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:32 AM
స్థానిక అవసరాల కోసం ప్రతిరోజు సిరిసిల్ల మానేరు వాగులో నుంచి ఇసుకను తీసుకోవాడానికి అనుమతినివ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మంగ ళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
సిరిసిల్ల టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : స్థానిక అవసరాల కోసం ప్రతిరోజు సిరిసిల్ల మానేరు వాగులో నుంచి ఇసుకను తీసుకోవాడానికి అనుమతినివ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మంగ ళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా ప్రధానకార్యదర్శి మూషం రమేష్, పట్టణ కార్యదర్శి అన్నల్‌దాస్ గణేష్ మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాన్ని అనుకొని ఉన్న మానేరు వాగు ఉండి అందులో కావాల్సినంతం ఇసుక ఉండి కూడా పట్టణ ప్రజలు ఇంటి నిర్మాణాలకు ఇసుక తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా కొత్తగా ప్రభుత్వం, జిల్లా అధికారులు పెట్టిన నిబంధనలతో 15 రోజులకు ఒక్కసారి మాత్రమే మానేరు వాగులో ఇసుకను తీసుకొవడానికి అనుమ తులు ఇవ్వడంతో ఇసుక దొరక స్థానిక ప్రజలు రూ. 4వేల నుంచి రూ. 5వేల వరకు బ్లాక్‌లో కొనుకునే పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతర నిర్మాణ పనులకు అనుమతినిచ్చే ఇసుకను రెవె న్యూ అధికారుల సహకారంతో ట్రాక్టర్ యజమానులు బ్లాక్‌లో అమ్ము కుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వే బిల్లులను పరిశీ లిస్తే దొంగలు బయటపడతారని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వల్లన ఇసుక ఎక్కువ అవసరం ఏర్పడిందని ప్రస్తుతం వర్షకాలం కాబ ట్టి వర్షాలతో వాగులో నుంచి ఇసుక తీయడం వీలు కాదన్నారు. ప్రభు త్వం జిల్లా అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇసుక ను బ్లాక్‌లో అమ్మకుండా నిఘా పెట్టాలని ఇసుకను బ్లాక్‌లో అమ్ముకు నే ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేయాలని డిమాండ్‌చేశారు. స్థానిక అవ సరాల కోసం మాత్రం ప్రతిరోజు ఇసుక తీసుకునేందుకు అనుమతుల ను ఇవ్వాలని రూ.1500లకే ఒక్క ట్రాక్టర్ ఇసుక ధరను నిర్ణయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమం టి ఎల్లారెడ్డి, కోడం రమణ, నాయకులు పాల్గొన్నారు.