Share News

డబుల్‌ బెడ్‌రూముల ఇళ్లకు మోక్షం

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:11 AM

జిల్లాలో పలు చోట్ల నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అందు బాటులోకి తీసుకువచ్చేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

డబుల్‌ బెడ్‌రూముల ఇళ్లకు మోక్షం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో పలు చోట్ల నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అందు బాటులోకి తీసుకువచ్చేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు కావాల్సిన నిధులను డి ఎంఎఫ్‌టి, గృహ నిర్మాణ శాఖ ద్వారా సుమారు తొమ్మిది కోట్ల పైచిలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొన్నిచోట్ల పనులు ప్రారంభం కాగా కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, రామగుండం, తదితర ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణా నికి ప్రభుత్వం 5 లక్షల 4 వేల రూపాయల నిధులు కేటాయించగా, మౌ లిక వసతుల కల్పన కోసం లక్షా 24 వేల రూపాయలను కేటాయించింది. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో కేవలం మంథని పట్టణంలోని పోచమ్మ వాడలో మాత్రమే 92 ఇండ్లను పూర్తి చేశారు. ఇందులో 75 మంది లబ్ధి దారులకు పంపిణీ చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి, చందపల్లిలో, కాల్వ శ్రీరాంపూర్‌, ఓదెల మండల కేంద్రాల్లో ఇండ్లు పూర్తి చేసినప్పటికీ మౌలిక సదుపాయాలను కల్పించలేదు. రామగుండం లోను పలుచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశకు చేరగా మౌలిక సదుపాయాలు కల్పించలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇండ్లను కేటాయించింది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కడైతే ఇండ్ల నిర్మా ణాలు పూర్తయి మౌలిక వసతులు లేని వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే జిల్లాలోని రాం పల్లి, చందపల్లిలో నిర్మించిన 484ఇండ్ల వద్ద రోడ్ల నిర్మాణాలు, మురికి కాలువలు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సుమారు 9 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆ నిధులతో యుద్ధ ప్రాతిపదికన 10 నెల ల్లో పనులు పూర్తి చేసి గత నెలలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇండ్లను పంపిణీ చేసి గృహప్రవేశం చేయించారు.

ఫ కాల్వ శ్రీరాంపూర్‌, ఓదెలలో మొదలైన పనులు

పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే విజయరమణారావు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల ఇండ్లను పంపిణీ చేసేం దుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రామగుండంలో గల 650 ఇండ్ల నిర్మాణా లను పూర్తిచేసేందుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ నిధులు విడుదల చేయాలని కోరడంతో నిధులను మంజూరు చేశారు. దీంతో కాల్వశ్రీరాంపూర్‌, ఓదెలలో పనులు ప్రారంభమయ్యాయి.

ఫ ఓదెల మండల కేంద్రంలో నిర్మించిన 144 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విద్యుత్‌ సౌకర్యం కోసం 20 లక్షల 83 వేలు, మురికి కాలువల కోసం 42 లక్షలు, తాగునీటి పనుల కోసం 80 లక్షల నిధులు మంజూరు చేశారు.

ఫ కాల్వ శ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో నిర్మించిన 240 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం విద్యుత్‌ సౌకర్యానికి 18 లక్షలు, తాగునీటి సరఫరా కోసం 74 లక్షలు, మురికి కాలువ నిర్మాణాలకు 56 లక్షల నిధులు మంజూరు చేశారు.

ఫ రామగుండం పట్టణంలో నిర్మించిన 650 ఇండ్ల నిర్మాణాల తాగు నీటి సౌకర్యానికి 3 కోట్ల 10 లక్షలు, విద్యుత్‌ సౌకర్యం కోసం కోటి 24 లక్ష లు, మురికి కాలువల నిర్మాణాలకు 3 కోట్ల 50 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ప్రస్తుతం కాల్వ శ్రీరాంపూర్‌, ఓదెలలో విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులు పూర్తి కాగా, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని హౌసింగ్‌ పిడి రాజేందర్‌ తెలిపారు. ఆగస్టు 15 వ తేదీ నాటికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓదెల, రామగుండంలో నిర్మించిన ఇండ్లకు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా, కాల్వశ్రీరాంపూర్‌లో 240 ఇండ్లకు 150 మంది లబ్ధిదారులను ఇదివరకే ఎంపిక చేశారు. ఇంకా 90 ఇళ్లకు ఎంపిక చేయాల్సి ఉంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం సందర్భంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హుల్లో ఎల్‌2 కేటగిరీలో సొంత ఇంటి స్థలం లేని లబ్ధిదారు లకు ఇండ్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయమై ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో బడుగు బలహీన వర్గాల ప్రజల కల నెరవేరనున్నది.

Updated Date - Jul 04 , 2025 | 01:11 AM