Share News

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:22 PM

జగిత్యాల రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
రాయికల్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

జగిత్యాలరూరల్‌, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి) :జగిత్యాల రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బతుకమ్మ లను తీరొక్కపూలతో పేర్చి మహిళలలు బతుకమ్మ పాటలు పాడారు. దాండియా ఆటలు, డీజే సౌండ్‌ల మధ్య నృత్యాలు యవతులు నృత్యాల చేస్తూ బతుకమ్మలను నెత్తిన పెట్టకొని ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం గ్రామ శివారులో గల చెరువులు, కుంటలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఫకోరుట్ల రూరల్‌: తెలంగాణ అసోసియేషన్‌ అఫ్‌ యూనైటెడ్‌ కిండ్‌ డం (టాక్‌) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ. దసరా వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. లండన్‌ మహానగరంలో చేనేత బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రవాసీ భారతీయ మహిళలు తెలంగాణ సంప్రదాయ దుస్తులు దరించి బతుకమ్మ వేడుకలను జరిపారు. బతుకమ్మ వేడుకలో స్థానిక హౌంస్లానగర్‌ మేయర్‌ అమీ క్రాప్ట్‌, తెలంగాన రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ మాజీ చైర్మెన్‌, టాక్‌ వ్యవస్థాపకుడు అనిల్‌ కూర్మాచలం పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు రత్నాకర్‌, శుష్మణ రెడ్డి, సురేష్‌, రాకేష్‌, సుప్రజ, సత్యపాల్‌, శ్రీకాంత్‌, ఆశోక్‌, నవీన్‌ రెడ్డి, మల్లారెడ్డి, గణేష్‌, పవిత్ర, స్వాతి, సత్యమూర్తి, వేంకట్‌ రెడ్డి, తస్యం, రవి పాల్గొన్నారు.

ఫవెల్గటూర్‌: వెల్గటూర్‌ మండలంలోని వివిధ గ్రామాలలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలను తీసుకువచ్చి బతుకమ్మలను అందంగా అలంకరించారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఒక్క చోట చేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ బతుకమ్మ ఆట ఆడారు. మరి కొన్ని చోట్ల డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అనంతరం సమీపం లోని జలాశయాల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే జలాశయాల వద్ద ప్రత్యేకాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఫరాయికల్‌: పట్టణంతో పాటు మండలంలోని దావన్‌పెల్లి గ్రామంలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలు గ్రామ కూడళ్లలో బతుకమ్మలను ఉంచి ఘనంగా ఆడారు. అనంతరం పట్టణ శివారులోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఫబీర్‌పూర్‌: బీర్‌పూర్‌ మండలకేంద్రంతో పాటు తుంగూర్‌ తదితర గ్రామాలలో బుధవారం బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఎస్సై రాజు పోలీస్‌ సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షించారు.

ఫపెగడపల్లి: పెగడపల్లి మండలంలోని వెంగళాయిపేట, రాములపల్లి , శాలపల్లి గ్రామాలలో బుదవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను గ్రామ కూడల్లలో పెట్టి ఆడి పాడి శోబాయాత్రగా చెరువులకు వెల్లి నిమజ్జనం చేశారు.

Updated Date - Oct 01 , 2025 | 11:22 PM