Share News

గ్రామాలాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:27 AM

అసెంబ్లీ శీతాకాల సమావే శాల్లో గ్రామాలభివృద్ధికి ప్రత్యేకనిధుల కేటా యింపుపై ప్రధానంగా చర్చించాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.

గ్రామాలాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించాలి

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ శీతాకాల సమావే శాల్లో గ్రామాలభివృద్ధికి ప్రత్యేకనిధుల కేటా యింపుపై ప్రధానంగా చర్చించాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్రవ్యాపార సంఘ భవ నంలో శుక్రవారం జిల్లాలో సీపీఎం నుంచి గెలు పొందిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులను సన్మానిం చారు. పార్టీజిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అధ్యక్షతన జరిగిన అభినందన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ హాజరయ్యా రు. నూతనంగా ఎన్నికైన వీర్నపల్లి సర్పంచ్‌ మాల్లారపు జోత్య్సఅరుణ్‌కుమార్‌, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ గ్రామసర్పంచ్‌ గన్నే రం వసంతనర్సయ్య, గర్జనపల్లి ఉప సర్పంచ్‌ న్యాత మోహన్‌, వార్డుసభ్యులు గుండెల్లి కళ్యా ణ్‌, లింగంపల్లి అనిల్‌, రజనీకాంత్‌, హారికలను సన్మానించి మెమెంటోలను అందజేశారు. అనం తరం జరిగిన సమావేశంలో రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ తమ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్నప్పుడు 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ లకు నేరుగా 50శాతం నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. కేరళలో సీపీఎం ప్రభు త్వం అనుసరించిన విధానాల ఫలితంగా పంచాయతీపాలన దేశానికి ఆదర్శంగా నిలి చిందన్నారు. రాష్ట్రంలో గతప్రభుత్వం సర్పంచ్‌ లకు నిధులను సకాలంలో ఇవ్వకుండా పంచా యతీల అభివృద్ధిని విస్మరించిదన్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సరైనసమయంలో గ్రామాల అభి వృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు అందిస్తానని కొడంగల్‌ సాక్షిగా ఇచ్చిన వాగ్ధానాలు నీటి మూటలు కావొద్దన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల్లో సీపీఎం సత్తాను చాటాలన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు టీ స్కైలాబ్‌బాబు మాట్లాడతూ జిల్లాలో సీపీ ఎం కార్మికవర్గ సమస్యలపైనే కాదు పల్లెప్రాంత ప్రజల హృదయాల్లో ఎర్రజెండా ఎగిరిందన్నా రు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేవీ ఎస్‌ఎన్‌ రాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగ మంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు అరుణ్‌కుమార్‌, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, గురజాల శ్రీధర్‌, మల్లారపు ప్రశాంత్‌, అన్నల్దాస్‌ గణేష్‌, సూరం పద్మ, శ్రీరాముల రమేష్‌చంద్ర పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:27 AM