Share News

ప్రతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు

ABN , Publish Date - May 21 , 2025 | 12:35 AM

రాబోయే రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు, ప్రతి పుణ్యక్షేత్రం బస్సు వేసే ప్రయత్నం కొనసాగుతోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ప్రతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు

వేములవాడ కల్చరల్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు, ప్రతి పుణ్యక్షేత్రం బస్సు వేసే ప్రయత్నం కొనసాగుతోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలుగు ప్రజల అభీష్టం మేరకే వేములవాడ-ముంబైకి బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో వేములవాడ-ముంబై రెండు ఏసీ బస్సులను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝాతో కలి సి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవా డకు వచ్చిన మంత్రి ముందుగా వేములవాడ రాజన్న ఆలయా నికి వచ్చారు. ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం వేములవా డ-ముంబై బస్సులను ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముంబై పర్యటనలో భాగంగా వెళ్లిన సమయంలో అక్కడున్న తెలుగు వారు తమకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కావాలని తెలుపడంతో తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు, తెలు గు ప్రజలు ఎక్కడున్న వారికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, దానికి అనుగుణంగానే రెండు ఏసీ లహరి బస్సు సర్వీసులను ప్రారం భిస్తున్నామన్నారు. ముంబైలో వున్న తెలంగాణ బిడ్డల ప్రయాణానికి ఇబ్బందులు తలేత్తకుండా ఉండాలని అక్కడి ప్రజల అభీష్టం మేరకే బస్సు సౌకర్యం కల్పించామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12.30గంటలకు వేముల వాడ నుంచి ముంబైకి బయలుదేరి తెల్లవారుజామున 4.45గంటలకు ముంబై చేరుకుంటుందన్నారు. అదేరోజు మధ్యాహ్నం ఇంటి గంటకు ముంబై నుంచి బయలుదేరి మరుసటిరోజు తెల్లవారున 5గంటలకు వేములవాడ చేరుకుంటుందన్నారు. అడుగగానే నెల రోజుల్లో బస్సు లను ఏర్పాటు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వేము లవాడ రాజన్న ఆలయ ఆరణ నుంచి బస్సులో తిప్పాపూర్‌ ఆర్టీసీ బస్డాండు వరకు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఏస్పీ మహేష్‌ బి. గీతే, ఏఎస్పీ శాఏషాద్రినిరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాణ, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ డిపో మేనేజర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:35 AM