ఆర్టీసీ బాదుడు
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:49 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణికులపై భారం మోపింది. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా కరీంనగర్-1, కరీంనగర్-2, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, మంథని, హుస్నాబాద్, హూజూరాబాద్ డిపోలు ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ రేట్లను పెంచడంతో తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా టోల్ ప్లాజా యూజర్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

- అన్ని రూట్లలో పెరిగిన చార్జీలు
- టోల్ ప్లాజా రూట్లలో అధికం
- పెరిగిన స్టూడెంట్‌పాస్‌రేట్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణికులపై భారం మోపింది. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా కరీంనగర్-1, కరీంనగర్-2, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, మంథని, హుస్నాబాద్, హూజూరాబాద్ డిపోలు ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ రేట్లను పెంచడంతో తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా టోల్ ప్లాజా యూజర్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. టోల్‌ప్లాజాలు ఉన్న ఉన్న రూట్లలోనే కాకుండా అన్ని రూట్లలో చార్జీలు ఒక్కసారిగా పెంచింది. టోల్‌ప్లాజాలా మీదుగా వెళ్లే ప్రయాణికుడి నుంచి అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ రూట్‌లో రెండు టోల్ ప్లాజాలు ఉంటే ఇరవై రూపాయలు చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఫ రూ. 10 నుంచి 20 వరకు..
ఒక్కో రూట్‌లో పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు చార్జీలు పెంచారు. వేములవాడకు గతంలో 50 రూపాయలు ఉంటే 60, జగిత్యాలకు 70 ఉంటే 80, హుజూరాబాద్‌కు 60 నుంచి 70, హన్మకొండకు 100 నుంచి 110, వరంగల్‌కు 110 నుంచి 120, మంథనికి 100 ఉంటే 110, పెద్దపల్లికి 60 ఉండగా 70, సిద్దిపేటకు 100 ఉంటే 120, హైదరాబాద్‌కు 230 నుంచి 260 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రూట్‌లో రెండు టోల్ ప్లాజాలు ఉండడంతో అదనంగా 30రూపాయలు పెంచారు. అన్ని రూట్లలో పదిరూపాయలుపెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఫ పెరిగిన బస్‌పాస్‌ఛార్జీలు
చార్జీలను పెంచడమే కాకుండా విద్యార్థుల బస్‌పాస్‌చార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయంతీసుకున్నది. విద్యార్థులు బస్‌పాస్ చార్జీలను ఒక్కసారిగా 20 శాతం పెంచడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.
సవరించిన బస్ పాస్‌చార్జీలు
-----------------------------------------------
జిల్లాలో నెలవారీ రూట్ పాస్‌లు
-----------------------------------------------
కిలో మీటర్లు పాత ఛార్జీ కొత్త ఛార్జీ
5 150 225
10 250 375
15 300 450
20 400 600
25 450 675
30 500 750
35 550 825
---------------------------------------------------------
దీనికి తోడు మూడు నెలల పాస్‌లకు 5 కిలోమీటర్ల వరకు 400 నుంచి 600 రూపాయలకు పెంచారు. పాస్ పాస్‌లలో టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో నెలకు 500 రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు.